సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే
అర్హతలు :
- సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి.
- ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.
- సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది.
- మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.
అనర్హులు ఎవరంటే:
- గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు.
- చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు.
- నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు.
- నేర శిక్షను అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు.
- మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు.
- పౌరహక్కుల పరిరక్షణచట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు .
- దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు.రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హుడు.
- గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.
- ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు.
- గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా
Please Post a Comment