తెలంగాణ రాష్ట్రం లో అంగన్ వాడి ఉద్యోగాలు.
తెలంగాణ రాష్ట్ర లోని మహిళా, శిశు, దివ్యంగుల మరియు వయోవృద్దుల శాఖ పరధిలో గల ఐ.సి.డి.యస్. లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్ధుల నుండి ఆన్లైన్ ద్వార దఖాస్తులు కోరనైనది. అభ్యర్ధులు వారి జిల్లాల వారిగా ఖాళీలను చూసి జిల్లాల షెడ్యులు ప్రకారం ఆన్లైన్ ద్వార అప్లై చేసుకోగలరు.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
- విద్యార్హతలు : టీచర్ కు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- అంగన్వాడీ సహాయకురాలి (Helper) పోస్టుకు సంబంధించి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థి ఎవరూ అందుబాటులో లేని పక్షంలో, తదుపరి తక్కువ విద్యార్హత (SSC) కలిగిన అభ్యర్థిని ఎంపిక కోసం పరిగణించవచ్చు.
- వయస్సు : 01/07/2026 నాటికి 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరలోపు ఉండాలి.
- అంగన్వాడీ కేంద్రానికి స్థానికులై వాస్తయులై ఉండాలి.
- గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామా పంచాయతీకి చెందిన వారై ఉండాలి.
- పట్టణ ప్రాంతానికి సంబందిత వార్డు కు చెందిన వారై ఉండాలి.
- రిజర్వేషన్ : పోస్టు వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ కు (కులం/వర్గం) సంబంధించిన అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
- ఒక వేళ అభ్యర్ధిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజిట్ లో గాని, కోర్టు ఉత్తర్వులు గాని ఉంటేనే ఆ అభ్యర్ధి పేరు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు వారి దరఖాస్తు ప్రింట్ కాపీ లను సంబందిత అంగన్ వాడి కేంద్రము యొక్క ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములలో అన్ని ద్రువపత్రాలను Attested Xerox కాపీలతో పరిశీలనకు సమర్పించవలెను.
వికలాంగులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు.
- అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించు కోగలిగిన వారు.
- కాళ్ళు, చేతులు సంబంధిచిన అంగ వైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు.
ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసిన ద్రువపత్రాలు :
- పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రము. (పదవ తరగతి సర్టిఫికేట్)
- కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ ద్వారా పొందినవి.
- విద్యార్హత దృవీకరణ పత్రము. ఇంటర్ / ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా.
- నివాస దృవీకరణ పత్రము తహసిల్దార్ ద్వారా పొందినవి.
- అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికేట్.
- వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రము
- ఆనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
Weightage for selection
| Parameter | Marks |
|---|---|
| Marks secured in Intermediate/ 12th Standard exam | 70 |
| Widow | 5 |
| Orphan (as per JJ Act, 2015) | 10 |
| Differently Abled (as per RPWD Act, 2016) | 5 |
| Interview by the Selection Committee | 10 |
| Total | 100 |
District Wise Notification and Vacancy Positions
| S. No | District | Start Date | Closing Date | Vacancies & Roster | Remarks |
|---|---|---|---|---|---|
| 1 | PEDDAPALLI | 20.06.2026 | 06.07.2026 | Download | Closed |
| 2 | MAHABUBNAGAR | 20.06.2026 | 03.06.2026 | Download | Closed |
| 3 | BHADRADRI-KOTHAGUDEM | 03.07.2026 | 18.07.2026 | Download | Live... |
| 4 | SANGAREDDY | 06.07.2026 | 17.07.2026 | Download | Live... |
| 5 | JOGULAMBA-GADWAL | 29.06.2026 | 08.07.2026 | Download | Live... |
| 6 | NALGONDA | 27.06.2026 | 10.07.2026 | Download | Live... |
| 7 | MULUGU | 01.07.2026 | 15.07.2026 | Download | Live... |

Please Post a Comment