బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖా ఆద్వర్యం లో పిల్లలకు ఉపకార వేతనం 2025-2026 సంవత్సరం నాకు గాను దరఖాస్తులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నారు.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆద్వర్యం లో బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు 2025-2026 సంవత్సరమునకు విద్యార్ధి, విద్యార్దినిల నుండి దరఖాస్తూలు స్వీకరించడానికి కేంద్ర కార్మిక శాఖ ప్రకటన జారి చేసినది. ప్రతి సంవత్సరం 1 వ తరగతి నుండి పీ.జీ కోర్సులు అభ్యసించే విద్యార్ధులు అధిక సంఖ్యలో స్కాలర్షిప్ అప్లై చేసుకోగలరు ఈ 2025-2026 అకాడమిక్ సంవత్సరం కు గాను ఈ ఉపకారవేతనం అందించడం జరుగుతుంది.
★ ప్రీ మెట్రిక్ కేటగిరి లో 1 వ తరగతి నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది : 31/08/2025.
★ పోస్ట్ మెట్రిక్ కేటగిరిలో ఇంటర్మీడియట్ మరియు ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్ధులు దరఖాస్తులు చేసుకొనుటకు చివరు తేది : 31/10/2025.
జతపరుచవలసినవి :
➤ విద్యార్ధి పాస్ మార్క్స్ మేమో
➤ బ్యాంకు పాస్ బుక్
➤ ఆధార్ కార్దు
➤ కుల దృవీకరణ పత్రం
➤ కార్మికురాలు బీడీ కంపని గుర్తింపు కార్డు
➤ అపాయింట్మెంట్ లెటర్
ఉపకార వేతనాల పట్టిక:
క్ర. సంఖ్యా | తరగతి/కేటగిరి | ఉపకార వేతనం |
---|---|---|
1 | 1వ తరగతి నుండి 4 వ తరగతి వరకు | 1,000/- |
2 | 5వ తరగతి నుండి 8 వ తరగతి వరకు | 1,500/- |
3 | 9వ తరగతి నమరియు 10 వ తరగతి | 2,000/- |
4 | ఇంటర్మీడియేట్ I & II Year | 3,000/- |
5 | ITI, పాలిటెక్నిక్, డిగ్రీ, BSc అగ్రి | 6,000/- |
6 | ప్రొఫెషనల్ కోర్స్ BE/MBBS/MBA | 25,000/- |
7 | Offical Website | Click Here |
8 | More Updates | Click Here |
9 | Join Whats App Channel | Click Here |
Please Post a Comment